బెజవాడ దుర్గమ్మ భక్తులకు శుభవార్త..

బెజవాడ దుర్గమ్మ భక్తులకు శుభవార్త..
x
Bezawad Kanaka durga temple
Highlights

లాక్ డౌన్ అనంతరం దుర్గమ్మ దర్శనానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

లాక్ డౌన్ అనంతరం దుర్గమ్మ దర్శనానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ అమ్మవారి దర్శనం చేసుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయానికి భక్తులు దర్శనానికి వచ్చే సమయంలో కచ్చితంగా నియమనిబంధనలు పాటించాలని తెలిపారు. అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే టిక్కెట్లను ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవాలి సూచించారు. ఎస్ఎమ్మెస్ ద్వారా టైమ్ స్లాట్ బుక్ చేసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేశారు.

ఆధార్ నెంబర్‌తో సహా దర్శన సమయాన్ని ఎస్ఎమ్మెస్‌లలో భక్తులకు సమాచారం అందిస్తారు. 24 గంటల ముందుగానే స్లాట్ బుక్ చేసుకునేలా ఏర్పాట్లను ఆలయ అధికారులు చేశారు. రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతి ఇస్తారు. గంటకు 250 మంది మాత్రమే అమ్మవారి దర్శించేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. అంతరాలయ దర్శనం, శఠగోపం, తీర్థం పంపిణి నిలిపి వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories