Chandrababu: చంద్రబాబు నివాసంలో నేటీతో ముగియనున్న హోమం

The Homam End In Chandrababu Residence
x

Chandrababu: చంద్రబాబు నివాసంలో నేటీతో ముగియనున్న హోమం

Highlights

Chandrababu: నేడు పూర్ణాహుతిలో పాల్గొననున్న చంద్రబాబు దంపతులు

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో చండీయాగం, సుదర్శన నారసింహ హోమాలను నిర్వహిస్తున్నారు. మూడు రోజులుగా జరుగుతున్న ఈ పూజలు నేడు ముగియనున్నాయి. ఈ రోజు జరిగే పూర్ణహుతిలో చంద్రబాబు దంపతులు పాల్గొననున్నారు. ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనేందుకు గుంటూరు, కృష్ణా జిల్లాల టీడపీ నేతలను చంద్రబాబు దంపతులు ఆహ్వానించారు.

చంద్రబాబు నివాసంలో శుక్రవారం నుంచి శతచండీ, పారాయణ, మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమాలు నిర్వహిస్తున్నారు. మూడు రోజులుగా జరుగుతున్న ఈ క్రతువులో చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు పాల్గొంటున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు దేవినేని ఉమా, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, కొల్లు రవీంద్ర, బోండా ఉమ, నారాయణ, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఏపీలో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు రానుండడం, ఇటీవల చంద్రబాబు జైలు నుంచి విడుదల కావడం, నారా లోకేశ్ యువగళం విజయవంతంగా ముగియడం తదితర పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు ఇంట హోమాలు నిర్వహించడం పొలిటికల్‌గా ప్రాధాన్యత సంతరించుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories