తిరుమలలో పెరుగుతున్న భక్తుల సంఖ్య

The growing devotees in Thirumala Temple
x

ఫైల్ ఇమేజ్ 

Highlights

* రోజుకు 50వేల మందికి దర్శనం * ఆన్‌లైన్ 20వేలు, ఆఫ్‌లైన్‌లో 20వేల మందికి దర్శంనం

సర్వ జగత్ రక్షకుడైన శ్రీవేంకటేశ్వరుని దివ్య క్షేత్రం తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. కరోనా అన్‌లాక్ అనంతరం తిరుమల సాధారణ స్థితికి చేరుకుంటోంది. స్వామి దర్శనానికి పరిమిత సంఖ్యలో అనుమతిస్తున్నా హుండీ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది.

తిరుమల క్షేత్రానికి భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సాధారణ పరిస్థితులు ఇప్పుడిప్పుడే వస్తుండడంతో భక్తుల సంఖ్యను క్రమంగా పెంచుతోంది టీటీడీ.. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనార్ధం భక్తులు వేల సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. కోనేటి రాయుడి క్షణకాల దర్శనం కోసం ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.

స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య గతంలో లక్షలలో ఉండేది. కానీ, కరోనా మానవాళిని కుదిపేసింది. ఈ క్రమంలో తిరుమలలో భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కలగలేదు. ప్రస్తుతం పరిమిత సంఖ్యలో భక్తులు దర్శనానికి టీటీడీ అనుమతిస్తోంది.

శ్రీవారి దర్శనాలకు గతేడాది జూలై 11న నుంచి భక్తులను అనుమతి ఇస్తుంది. మొదట 6వేలకు మంది భక్తులకు దర్శనాలను కల్పించిన టీటీడీ ఆ తర్వాత దశలవారీగా పెంచుతూ వచ్చింది. ప్రస్తుతం 50వేల మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తోంది. శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లను రోజుకు 20వేల చొప్పున ముందుగానే కేటాయిస్తున్నా టీటీడీ ఆఫ్‌లైన్‌లో మరో 20వేల సర్వదర్శన టికెట్లను అందుబాటులో ఉంచుతోంది. ప్రత్యేక దర్శనార్ధం మరో 10వేల టికెట్లను జారీ చేస్తోంది.

గతేడాది జనవరిలో హుండీ ఆదాయం 94కోట్ల 90 లక్షల ఆదాయం లభించింది. ఈ ఏడాది జనవరి నెలలో 83 కోట్ల 87 లక్షలు స్వామి వారికి కానుకల రూపంలో భక్తులు సమర్పించుకున్నారు. దశలవారీగా భక్తుల సంఖ్య పెంచుతున్న టీటీడీ రాబోయే రోజులలో మరో 10 వేల మందికి అదనంగా దర్శనం కల్పించే ఎందుకు ఏర్పాట్లు టీటీడీ చేస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories