రాజధానిపై కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం

రాజధానిపై కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం
x
ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి
Highlights

ఏపీలో సోమవారం కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి.

ఏపీలో సోమవారం కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. ప్రభుత్వం రాజధానిపై కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం వేయబోతున్నట్లు తెలుస్తోంది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం అవుతోంది. అసెంబ్లీకి ముందు మంత్రి వర్గం సమావేశం జరుగుతుంది. మంత్రివర్గం సీఆర్డీఏ బిల్లుకు ఆమోదం తెలుపనుంది. కేబినెట్‌లో బిల్లును ఆమోదించిన వెంటనే దాన్ని గవర్నర్ ఆమోదానికి పంపిస్తారని తెలిసింది. మూడు రాజధానుల అంశంపై ఇప్పటికే హైపవర్ కమిటీ సీఎంతో సమావేశమై చర్చించింది. సీఆర్డీఏ చట్టం రద్దును ఆర్థిక బిల్లుగా పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లు అంశంపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌తో ఆర్థిక మంత్రి బుగ్గన, చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి చర్చించారు. న్యాయ, సాంకేతిక పరమైన అడ్డంకులు రాకుండా మల్టిపుల్‌ ఆప్షన్స్‌పై ఫోకస్‌ పెట్టారు. అయితే ఇప్పటికే ఏపీ కేబినెట్‌ భేటీ షెడ్యూల్‌ రెండుసార్లు మారింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories