పోషకాహారాన్ని అందించడమే గోరుముద్ద లక్ష్యం: మంత్రి కొడాలి నాని

విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించడమే జగనన్న గోరుముద్ద లక్ష్యమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు.

S. Srikanth
Published on: 8 Feb 2020 5:21 PM IST
పోషకాహారాన్ని అందించడమే గోరుముద్ద లక్ష్యం: మంత్రి కొడాలి నాని
X

గుడివాడ: విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించడమే జగనన్న గోరుముద్ద లక్ష్యమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. స్థానిక మున్సిపల్ ఉన్నత పాఠశాలలో శనివారం మంత్రి మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆహారంలో నాణ్యత పెంచడంతో పాటు మెనూలో మార్పులు చేశామని, నిర్వాహకులు మెనూను తప్పక పాటించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వైసీపీ పట్టణ అధ్యక్షుడు శ్రీను, మున్సిపల్ మాజీ చైర్మన్ ప్రసాదరావు, మాజీ కౌన్సిలర్ పొట్లూరి వెంకట కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story