Gas Leak Blast: గన్నవరంలోని అపెక్స్‌ కాస్టింగ్‌ కంపెనీలో పేలుడు

* నలుగురికి తీవ్రగాయాలు ముగ్గురి పరిస్థితి విషమం.. ఆస్పత్రికి తరలింపు

R Tripura Malini
Published on: 9 Nov 2022 8:57 AM IST
Gas Leak Blast: గన్నవరంలోని అపెక్స్‌ కాస్టింగ్‌ కంపెనీలో పేలుడు
X

Gas Leak Blast: కృష్ణాజిల్లా గన్నవరంలోని అపెక్స్‌ కాస్టింగ్‌ కంపెనీలో పేలుడు సంభవించింది. కంపెనీలో కార్మికులు పనిచేస్తున్న సమయంలో గ్యాస్‌ లీకై బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులకు తీవ్రగాయాలు కాగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే కంపెనీలో బ్లాస్ట్‌ ఘటనను గోప్యంగా ఉంచింది ఫ్యాక్టరీ యాజమాన్యం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పేలుడుకు గల కారణాలపై కూపీ లాగుతున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story