BJP: బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల ఐదో జాబితా విడుదల

The Fifth List Of BJP Lok Sabha Candidates Has Been Released
x

BJP: బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల ఐదో జాబితా విడుదల

Highlights

BJP: బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల ఐదో జాబితా విడుదలైంది.

BJP: బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల ఐదో జాబితా విడుదలైంది. 111 మందితో లిస్ట్ రిలీజ్ చేసింది పార్టీ హై కమాండ్. ఐదో జాబితాలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పలువురు నేతలకు చోటు దక్కింది. ఏపీ విషయానికొస్తే.. అనకాపల్లి- సీఎం రమేష్ అరకు- కొత్తపల్లి గీత, రాజమండ్రి- పురంధేశ్వరి, రాజంపేట- కిరణ్‌కుమార్ రెడ్డి, తిరుపతి- వరప్రసాద్, నరసాపురం టికెట్ శ్రీనివాస్‌వర్మకు కేటాయించారు. ఇక తెలంగాణలో పెండింగ్‌లో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కమలం పార్టీ. ఖమ్మం నుంచి తాండ్ర వినోద్‌రావు పోటీ చేయనున్నారు. ఇక..ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఆరూరి రమేష్ వరంగల్ నుంచి బరిలోకి దిగనున్నారు. ఈ రెండు స్థానాలతో తెలంగాణలోని మొత్తం 17 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన పూర్తయినట్లైంది..

Show Full Article
Print Article
Next Story
More Stories