బీజేపీపై మండిపడ్డ సీపీఐ నేత నారాయణ

బీజేపీపై మండిపడ్డ  సీపీఐ నేత నారాయణ
x
సీపీఐ నేత నారాయణ
Highlights

భారత రాజ్యాంగ వ్యవస్థను బీజేపీ కుప్పకూల్చిందని మండిపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. అధికార దాహంతో మహారాష్ట్రలో రాత్రికి రాత్రే రాజకీయ...

భారత రాజ్యాంగ వ్యవస్థను బీజేపీ కుప్పకూల్చిందని మండిపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. అధికార దాహంతో మహారాష్ట్రలో రాత్రికి రాత్రే రాజకీయ సాంప్రదాయాలను మోడీ, అమిత్ షా తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు.

సీబీఐ, ఐటీలను చేతిలో పెట్టుకొని బ్లాక్‌మెయిల్‌ చేయడమే బీజేపీ ప్రధాన అస్త్రాలని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే మోడీ రాజకీయ వ్యూహాలకు బలికాక తప్పదన్నారు. మాతృభాష తల్లి పాల లాంటిదని ఇంగ్లీష్ భాష పోత పాలు లాంటిదనేది ఇంగ్లీష్ మీడియంపై తన‌ అభిప్రాయాన్ని తెలిపారు నారాయణ.
Show Full Article
Print Article
More On
Next Story
More Stories