Coronavirus: పుణ్యక్షేత్రాలపై పడిన కరోనా ప్రభావం

Coronavirus: పుణ్యక్షేత్రాలపై పడిన కరోనా ప్రభావం
x
Tirumala (File photo)
Highlights

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ఎఫెక్ట్ తిరుమలను తాకింది. దాంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పడిపోయింది.

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ఎఫెక్ట్ తిరుమలను తాకింది. దాంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. రోజుకు లక్షలాది మంది వచ్చే ఈ పుణ్యక్షేత్రానికి భక్తులు తగ్గిపోయారు. టీటీడీ యాత్రికులు, భక్తులు తమ తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దాంతో తిరుమల కొండ ఖాళీగా దర్శనమిస్తోంది. అటు తిరుపతి కూడా జనాలు లేక బోసిపోతుంది.

ప్రపంచవ్యాప్తంగా మరణమృదాంగం మోగిస్తోన్న కరోనా ప్రభావం పుణ్యక్షేత్రాలపై పడింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు కరోనా వ్యాప్తి నివారణ చర్యలు చేపట్టారు. దాంతో ఎప్పుడు రద్దీగా ఉండే తిరుమలకు వచ్చే భక్తులు తగ్గిపోయారు. దాంతో నిండుగా కనిపించే కంపార్ట్ మెంట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కంపార్ట్ మెంట్లో భక్తులు వెయిట్ చేయకుండా టీటీడీ టైం స్లాట్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది..దాంతో టైం ప్రకారం శ్రీవారిని దర్శించుకునే విధంగా అవకాశం కల్పిస్తోంది.

మంగళవారం నుంచి టైం స్లాట్ టోకెన్లు జారీ మొదలు కావడంతో ఆర్టీసీ బస్సులు కూడా ఖాళీగా వెళ్తున్నాయి. అసలే భక్తులు తగ్గి, ఆ తరువాత టైం స్లాట్ కావడంతో స్థానికులందరు సొంత వాహనాల్లో వెళ్తున్నారు. బయటి నుంచి వచ్చిన వారు మాత్రమే బస్సులలో వెళ్తున్నారు. ఎప్పుడు రద్దీగా ‎ఉండే ఆర్టీసీ బస్సులు ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఆర్టీసీ బస్సులను చూస్తుంటనే కరోనా ఎఫెక్ట్ తిరుమలలో ఎంత ప్రభావం చూపిస్తుందో స్పష్టంగా ఉందంటున్నారు ప్రయాణికులు..

టైం స్లాట్ విధానాన్ని అమలులోకి తెచ్చిన టీటీడీ తిరుమల సీఆర్‌వో వద్ద 7 కౌంటర్లు, ఆర్టీసీ బస్టాండులో 7 కౌంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే తిరుపతిలో టోకెన్లు జారీ కోసం పలు కేంద్రాలు ఏర్పాలు చేశారు. దీంతో పాటు అలిపిరి ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్లు జారీ చేస్తున్నారు..

మరోవైపు ఉచిత నిత్య అన్నదాన భవనంలోకి జనాలను తగ్గించారు. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ ఉచిత అన్నప్రసాద భవనంలో ఒక్కోక్క హాలులో ఒకేసారి వెయ్యి మంది తినే సదుపాయం ఉంది. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ తో భవనంలోకి 500మందికే మాత్రమే అన్నం తినే సదుపాయం కల్పించనున్నారు. నలుగురు కూర్చునే టేబుల్ పై ఇద్దరికే అవకాశం కల్పిస్తున్నారు.

మొత్తంగా తిరుమలలో కరోనా కట్టడి కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి భక్తులు రాకుండా టీటీడీ ఇచ్చిన ఆదేశాలను భక్తులు పూర్తిగా సహకరిస్తున్నారు. భయాంకరమైన వైరస్ అదుపులోకి వచ్చిన తర్వాతనే తదుపరి ఆదేశాలు జారీ చేయనున్నారు టీటీడీ అధికారులు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories