వచ్చే నెల రెండో వారంలో ఏపీకి కేంద్ర బృందం

X
Highlights
నవంబర్ రెండో వారంలో ఏపీకి కేంద్ర బృందం రానుంది. నవంబర్ 9,10 తేదీల్లో వరద నష్టం అంచనాపై పర్యటించనుంది. గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనుంది సెంట్రల్ టీమ్.
admin31 Oct 2020 4:17 PM GMT
నవంబర్ రెండో వారంలో ఏపీకి కేంద్ర బృందం రానుంది. నవంబర్ 9,10 తేదీల్లో వరద నష్టం అంచనాపై పర్యటించనుంది. గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనుంది సెంట్రల్ టీమ్. ఈ నేపథ్యంలో పంట, ఆస్తి నష్టం అంచనాలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. రెండు రోజుల్లో నష్టంపై తుది అంచనాలను సమర్పించనున్నారు అధికారులు. వరద కారణంగా 12 శాఖలకు సంబంధించి భారీగా నష్టం వాటిల్లినట్లు అంచనాకు వచ్చారు. ఆర్ అండ్ బీకి సుమారు 5 వేల కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు సమాచారం. సుమారు 10 వేల కోట్ల రూపాయల మేర పంట నష్టం వాటిల్లిందని.. తక్షణ సాయంగా వెయ్యి కోట్లు అడగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Web TitleThe central team will come to Andhra Pradesh in the second week of November
Next Story