ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే.. స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం

The Central Government Has Made it Clear that the Capital of Andhra Pradesh is Amravati
x

 ఏపీ రాజధాని అమరావతి

Highlights

AP Capital: రాజధానిపై నిర్ణయం రాష్ట్రానిదేనని తేల్చిన కేంద్రం

AP Capital: ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే రాజధాని అని కేంద్రం స్పష్టం చేసింది. బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏంటనే దానిపై క్లారిటీ కోరగా హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సభలో సమాధానమిచ్చారు. మూడు రాజధానుల అంశంతో ఏపీ రాజధాని ఏంటనే సందిగ్ధాన్ని తేల్చాలని జీవీఎల్ కోరగా కేంద్ర సర్కార్ అమరావతిపై స్పష్టతనిచ్చింది. ఇందుకు స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ప్రస్తుతానికి అమరావతే ఏపీ రాజధాని అని పేర్కొన్నారు. అంతేకాదు.. రాజధానిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే. మా దగ్గరున్న సమాచారం ప్రకారం ఏపీకి రాజధాని అమరావతే అని కూడా కేంద్రం తరఫున మంత్రి తేల్చిచెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories