Kanakamedala: పార్లమెంట్‌లో కొత్త బిల్లులపై కేంద్ర ప్రభుత్వం వివరించింది

The central government explained the new bills in the parliament Says Kanakamedala
x

Kanakamedala: పార్లమెంట్‌లో కొత్త బిల్లులపై కేంద్ర ప్రభుత్వం వివరించింది

Highlights

Kanakamedala: రాష్ట్ర ఆర్థిక, శాంతిభద్రత పరిస్థితిపై అఖిలపక్షంలో ప్రస్తావించా

Kanakamedala: అఖిల పక్ష సమావేశంలో డిమాండ్ గ్రాంట్స్‌తో పాటు ఇండియన్ పీనల్ కోడ్ తదితర బిల్లుల స్థానంలో తీసుకొచ్చే కొత్త బిల్లుల గురించి ప్రభుత్వం వివరించిందన్నారు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్.. అఖిల పక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన హామీల అమలు గురించి అఖిలపక్షంలో ప్రస్తావించామన్నారాయన.. పోలవరం ప్రాజెక్టుపై దృష్టి సారించాలని కోరాను. రాష్ట్ర రాజధాని అంశాన్ని కూడా ప్రస్తావించాను. ఏపీలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా విభజన హామీలు అమలు కావడం లేదని, రాష్ట్ర ఆర్థిక, శాంతి భద్రతల పరిస్థితి గురించి ఈ సమావేశంలో లేవనత్తానన్నారు కనకమేడల... గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షిస్తూ, కేసులు పెడుతూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న వైఖరిని ఎత్తి చూపామన్నారు. ఏపీలో ఉన్న ఓట్లను తొలగించి, దొంగ ఓట్లను చేర్చుతున్న వ్యవహారాన్ని కూడా అఖిలపక్షం దృష్టికి తీసుకెళ్లామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories