జగన్ మీద రాయి దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా

The Central Election Commission Inquired About The Incident Of Stone Attack On Jagan
x

జగన్ మీద రాయి దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా

Highlights

ఘటన వివరాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం

AP News: సీఎం జగన్‌పై రాయి దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. ఘటనకు సంబంధించి వివరాలు కోరినట్టు సమాచారం. వీఐపీల భద్రతలో వరుస వైఫల్యాలపై కేంద్రం ఎన్నికల సంఘం దృష్టి సారించినట్టు తెలుస్తోంది. చిలకలూరిపేటలో ప్రధాని సభ, సీఎం రోడ్‌ షోలో భద్రతా వైఫల్యంపై ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. రాజకీయ హింసాత్మక ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈసీ సూచించింది. ప్రధాని సభలో భద్రతా వైఫల్యంపై ఇప్పటికే ఐజీ, ఎస్పీపై బదిలీ వేటు పడిన విషయం తెలిసిందే. జగన్‌ రోడ్‌ షోలో భద్రతా వైఫల్యంపై అధికారులపై చర్యలు తీసుకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది. రాయి దాడి ఘటనపై విజయవాడ సీపీ.. ఈసీకి నివేదిక సమర్పించారు. దర్యాప్తునకు 20 మంది సిబ్బందితో ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, టాస్క్‌ఫోర్స్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. ఘటనా స్థలంలో సీసీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు.. సెల్‌ టవర్‌ డేటాను కూడా సేకరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories