హెచ్ఆర్ లో మార్పులపై కొత్త జీవో జారీ చేసిన ఏపీ సర్కారు

The AP Government Has Issued A New Jio On Changes in HR
x

హెచ్ఆర్ లో మార్పులపై కొత్త జీవో జారీ చేసిన ఏపీ సర్కారు

Highlights

Andhra Pradesh: హెచ్ఆర్ఏ 24 శాతం పెంపు,కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు.

Andhra Pradesh: ఉద్యోగుల వేతనాలు, ఇతర అంశాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రుల కమిటీతో కుదిరిన ఒప్పందం మేరకు కొత్త పీఆర్సీ జీవోలు జారీ చేసింది. 11వ పీఆర్సీలో హెచ్ఆర్ఏ 16 శాతం ఉండగా, మంత్రుల కమిటీ అంగీకరించిన మేరకు దాన్ని తాజా ఉత్తర్వుల్లో 24 శాతానికి పెంచారు. హెచ్ఆర్ఏ గరిష్ఠ పరిమితిని రూ.25 వేలుగా ఫిక్స్ చేశారు. ఏపీ సచివాలయ ఉద్యోగులు, HOD కార్యాలయాల ఉద్యోగులు, ఏపీ భవన్, హైదరాబాదులో పనిచేసే ఏపీ ఉద్యోగులకు ఈ 24 శాతం హెచ్ఆర్ఏ వర్తిస్తుందని తెలిపారు. 2022 జనవరి నెలకు చెల్లించిన వేతనాల్లో హెచ్చు తగ్గులను సవరిస్తామని జీవోల్లో పేర్కొన్నారు అధికారులు. ఫిబ్రవరి 2022 నెలకు సంబంధించిన వేతన, పెన్షన్ బిల్లులను సిద్ధం చేయాలని DDOలకు ఆదేశాలు జారీ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories