మార్చి 23 నుంచి ఏపీలో పదో తరగతి పరీక్షలు

మార్చి 23 నుంచి ఏపీలో పదో తరగతి పరీక్షలు
x
Highlights

ఏపీలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 8 వరకు జరపనున్నట్టు విద్యాశాఖ తెలిపింది. ఈ మేరకు మంగళవారం వెలగపూడిలోని తాత్కాలిక...

ఏపీలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 8 వరకు జరపనున్నట్టు విద్యాశాఖ తెలిపింది. ఈ మేరకు మంగళవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంత్రులు ఆదిమూలపు సురేశ్, అనిల్‌కుమార్‌ యాదవ్‌ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. వచ్చే ఏడాది మార్చి 23 నుంచి మొదలై ఏప్రిల్ 8 వరకు జరుగుతాయని.. పరీక్ష ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 కు ముగుస్తుందని మంత్రులు తెలిపారు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈ నెల 20 వరకు అవకాశం ఉందని తెలిపారు. రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబరు 27 వరకు, రూ.200 రుసుముతో జనవరి 4 వరకు, రూ.500 రుసుముతో జనవరి 18 వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు.

పరీక్షల షెడ్యూల్‌

23/03/20 ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1(గ్రూప్‌-ఏ)

ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1(కాంపోజిట్‌)

24/03/20 ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2(గ్రూప్‌-ఏ)

ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2(కాంపోజిట్‌)

ఓఎస్‌ఎస్‌సీ లాంగ్వేజ్‌ పేపర్‌-1

(సంస్కృతం, అరబిక్‌, పర్షియన్‌)

26/03/20 సెకండ్‌ లాంగ్వేజ్‌

27/03/20 ఇంగ్లీషు పేపర్‌-1

28/03/20 ఇంగ్లీషు పేపర్‌-2

30/03/20 మేథ్స్‌ పేపర్‌-1

31/03/20 మేథ్స్‌ పేపర్‌-2

01/04/20 జనరల్‌ సైన్స్‌ పేపర్‌-1

03/04/20 జనరల్‌ సైన్స్‌ పేపర్‌-2

04/04/20 సోషల్‌ స్టడీస్‌ పేపర్‌-1

06/04/20 సోషల్‌ స్టడీస్‌ పేపర్‌-2

07/04/20 ఓఎస్‌ఎస్‌సీ లాంగ్వేజ్‌ పేపర్‌-2

(సంస్కృతం, అరబిక్‌, పర్షియన్‌)

08/04/20 ఎస్‌ఎస్‌సీ వొకేషనల్‌ కోర్స్‌(థియరీ)

Show Full Article
Print Article
More On
Next Story
More Stories