అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు
x
Highlights

* సోషల్‌ మీడియా పోస్టులతో జేసీ, ఎమ్మెల్యే వర్గాల మధ్య వార్ * కిరణ్ అనే యువకుడిని చితకబాదిన ఎమ్మెల్యే అనుచరులు *ఎమ్మెల్యే అనుచరుల ఘర్షణతో ఇరువర్గాల ఘర్షణ * పరస్పరం రాళ్లు రువ్వుకుంటున్న రెండు వర్గాలు * రాళ్లదాడిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి వాహనం ధ్వంసం

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గాల మధ్య సోషల్ మీడియా వార్ ముదిరింది. సోషల్‌ మీడియాలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి భార్యకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు జేసీ వర్గీయులు. దీంతో అనుచరులతో సహా ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లిన పెద్దారెడ్డి.. ఇంట్లో ఉన్న ప్రభాకర్ రెడ్డి అనుచరులపై దాడి చేశారు. కిరణ్ అనే యువకుడిని చితకబాదారు.

ఎమ్మెల్యే అనుచరుల దాడితో తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జేసీ వర్గీయులు.. ఎమ్మెల్యే వర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగింది. ప్రభాకర్ రెడ్డి ఇంటి దగ్గర భారీగా మోహరించిన రెండు వర్గాలు పరస్పరం రాళ్ల దాడి చేసుకుంటున్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఎద్దుల బండ్లలో ఇసుక రవాణా చేస్తున్న వారి నుంచి ఎమ్మెల్యే భార్య రమాదేవి డబ్బులు వసూలు చేస్తున్నారని జేసీ వర్గానికి చెందిన వలీ పోస్టులు పెట్టాడు. దీంతో వలీ కోసం ఎమ్మెల్యే కేతిరెడ్డి.. ప్రబాకర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అతను కనిపించకపోవటంతో ఇంట్లోని ప్రభాకర్ రెడ్డి అనుచరులపై దాడి చేసి వెళ్లారు.

Show Full Article
Print Article
Next Story
More Stories