విశాఖలో టెన్షన్‌.. టెన్షన్‌..

విశాఖలో టెన్షన్‌.. టెన్షన్‌..
x
Highlights

* ప్రమాణాల చుట్టూ తిరుగుతున్న విశాఖ పాలిటిక్స్ * సాయిబాబా ఆలయంలో ప్రమాణం చేస్తానంటున్న వెలగపూడి * సాయిబాబా ఆలయ పరిసరాల్లో ‎మూడంచెల పోలీసు పహారా *పార్టీ కార్యాలయానికి చేరుకున్న వెలగపూడి రామకృష్ణ‌

విశాఖలో ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం అక్కడి రాజకీయం ప్రమాణాల చుట్టూ తిరుగుతోంది. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణకు బినామీ భూములున్నాయంటూ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో మూడు రోజులుగా టీడీపీ, వైసీసీ నాయకుల మధ్య ప్రమాణ సవాళ్లు నడుస్తున్నాయి. ఎంపీ విజయసాయి తనపై చేసిన వ్యాఖ్యలు నిజం కావంటూ ఎమ్మెల్యే వెలగపూడి సాయిబాబా ఆలయంలో ప్రమాణం చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆలయ పరిసరాల్లో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అటు వెలగపూడి ఆఫీస్‌కు బయల్దేరిన వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపించారు.

తాటాకు చప్పుళ్లకు తాను భయపడనన్నారు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ. విజయసాయి రెడ్డి సవాల్‌ విసిరారు కాబట్టి.. సాయిబాబా ఆలయానికి ఆయన వస్తేనే తాను ప్రమాణం చేస్తానన్నారు వెలగపూడి. ఎంతో నిజాయితీగా రాజకీయాలు చేసుకుంటున్న తనపై బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories