విశాఖలో ఉద్రిక్తత...పల్లా శ్రీనివాస్ దీక్షను భగ్నం చేసిన పోలీసులు

Tension In Visakhapatnam Steel Plant
x
శ్రీనివాస రావు (ఫైల్ ఇమేజ్)
Highlights

* బలవంతంగా ఆస్పత్రికి తీసుకెళ్లిన పోలీసులు * 6 రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న పల్లా శ్రీనివాస్

విశాఖలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అమరణ దీక్ష చేస్తున్న టీడీపీ విశాఖ పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సభ వద్ద అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. పల్లా శ్రీనివాస్ దీక్షను పోలీసులు అర్ధరాత్రి సమయంలో భగ్నం చేశారు. భారీ బందోబస్తు నడుమ ఆయన్ను కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి తరలించారు. అంతకుముందు సభా స్థలంలో హైడ్రామా జరిగింది. పల్లాను ఆస్పత్రికి తరలించే సమయంలో పోలీసులకు, టీడీపీ నేతలకు మద్య వాగ్వాదం జరిగింది. పోలీసుల వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు రోడ్డుపైనే అడ్డుకున్నారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పల్లా శ్రీనివాస్ ఆరు రోజులుగా ఆమరణ నిరహర దీక్ష చేస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. మరోవైపు దీక్షకు సంఘీభావం తెలిపేందుకు విశాఖకు అమరావతి రైతులు చేరుకున్నారు. దీంతో అర్ధరాత్రి సమయంలో భారీగా మోహరించిన పోలీసులు అందరూ నిద్రపోతున్న సమయంలో దీక్షను భగ్నం చేశారు. మరోవైపు.. ఇవాళ విశాఖలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. పల్లా శ్రీనివాస్‌కు సంఘీభావం తెలిపి అనంతరం ఆందోళనలో పాల్గొననున్నారు. సాయంత్రం బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నడంతో.. పల్లా శ్రీనివాస్ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం ఉన్నట్టు తెలుస్తోంది.

ఇంకోవైపు పల్లా శ్రీనివాస్‌కు సంఘీభావంగా ఇవాళ గాజువాక బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ బంద్‌లో వర్తక వాణిజ్య సంస్థలు స్వచ్ఛదంగా పాల్గొంటున్నాయి. కేంద్రం ప్రభుత్వం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేయవద్దని ఆందోళన బాట పట్టాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories