సత్యసాయి జిల్లా కోడూరులో ఉద్రిక్తత.. నేషనల్ హైవే పక్కన గుడిసెలను తొలగించిన పోలీసులు

Tension in Koduru of Sathya Sai District
x

సత్యసాయి జిల్లా కోడూరులో ఉద్రిక్తత.. నేషనల్ హైవే పక్కన గుడిసెలను తొలగించిన పోలీసులు

Highlights

గత 15 ఏళ‌్లుగా ఇళ్ల పట్టాలకోసం గుడిసెలు వేసుకున్నామన్న బాధితులు

Sathya Sai District: సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కోడూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నేషనల్ హైవే పక్కన వెలసిన గుడిసెలను పోలీసులు తొలగించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గత 15 ఏళ్లుగా ఇళ్ల పట్టాల కోసం ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్నామని బాధితులు చెబుతున్నారు. అయితే ఆ స్థలం రిజర్వ్‌లో ఉందంటూ పోలీసులు గుడిసెలను తొలగించేందుకు ప్రయత్నం చేశారు. అదే స్థలంలో తమకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు గుడిసెలు తొలగిస్తుండగా మహిళలు అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories