Botsa Satyanarayana: మంత్రి బొత్స క్యాంపు ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత.. యువకుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్

Tension In Front Of Minister Botsa Camp Office In Vijayawada
x

Botsa Satyanarayana: మంత్రి బొత్స క్యాంపు ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత.. యువకుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్

Highlights

Botsa Satyanarayana: ఆందోళన చేస్తోన్న యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు

Botsa Satyanarayana: విజయవాడలోని మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయం ఎదుట తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. మెగా డీఎస్సీ విడుదల చేయాలంటూ డీవైఎఫ్ఐ నాయకులు మంత్రి బొత్స క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. దాదాపు వందల సంఖ్యలో యువకులు క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మెగా డీఎస్సీతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలంటూ విద్యార్థి నాయకులు ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులను తమ వాహనాల్లో పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories