అనంతపురం జిల్లాలో రామన్ స్కూ్ల్‌ వద్ద ఉద్రిక్తత

Tension At Raman School Anantapuram District
x

అనంతపురం జిల్లాలో రామన్ స్కూ్ల్‌ వద్ద ఉద్రిక్తత

Highlights

* ఆత్మహత్య చేసుకున్న తొమ్మిదో తరగతి విద్యార్థి.. టీచర్లు కొట్టడం వల్లే చనిపోయాడని పేరెంట్స్ ఆరోపణ

Ananthapur: అనంతపురం జిల్లాలో తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ముద్దలపురంకి చెందిన హరికృష్ణ అనంతపురంలో రామన్ స్కూ్ల్‌లో నైన్త్ క్లాస్ చదువుతున్నాడు. అయితే స్కూలులో ఏం జరిగిందో తెలియదు కానీ స్కూలు నుంచి ఇంటికి వెళ్లిన హరికృష‌్ణ గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది చూసిన కుటుంబసభ్యులు వెంటనే హరికృష్ణను ఆసుపత్రికి తీసుకువెళుతుండగా మధ్యలోనే చనిపోయాడు.

దీంతో టీచర్లు కొట్టడంతోనే తమ కొడుకు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపించారు. వీరికి మద్దతుగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు స్కూలు ముందు ఆందోళనకు దిగారు. విద్యార్థి మృతికి కారణమైన ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేశారు. అయితే ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తిచడంతోనే టీచర్ మందలించారని యాజమాన్యం చెబుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories