సీఐడీ ఫ్యాక్ట్‌చెక్‌ వాట్సప్‌కు ఫిర్యాదులు వెల్లువ.. 9 రోజుల్లోనే

సీఐడీ ఫ్యాక్ట్‌చెక్‌ వాట్సప్‌కు ఫిర్యాదులు వెల్లువ.. 9 రోజుల్లోనే
x
Representational Image
Highlights

కరోనా వైరస్ కలవరం పెడుతుంటే.. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు వెల్లువెత్తుతోంది.

కరోనా వైరస్ కలవరం పెడుతుంటే.. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు వెల్లువెత్తుతోంది. మొబైల్ వినియోగారులు తమకొస్తున్న సందేశాల్లోని సారాంశం వాస్తవమా? కాదా? అనేది నిర్ధారించుకోకుండానే చాలామంది వాటిని వేర్వేరు గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. లాక్​డౌన్​తో చాలా మంది ఖాళీగా ఉండటంతో సామాజిక మాధ్యమాల్లో తమకు గిట్టని వారిని కించపరిచేలా పోస్టులు పెట్టటం, అసభ్యకర వ్యాఖ్యలు చేయటం, వేధించటం వంటివి చేస్తున్నారు.

ఇలాంటి తప్పుడు ప్రచారాలకు చెక్ పెట్టేందుకు ఏపీ సీఐడీ తీసుకొచ్చిన 'ఫ్యాక్ట్ చెక్ వాట్సప్' నంబర్​కు గత తొమ్మిది రోజుల్లో 10,068 ఫిర్యాదులు అందాయి. రోజుకు సగటున వెయ్యి వరకు ఫిర్యాదులు అందుతున్నాయని సీఐడీ విభాగాధిపతి పీవీ సునీల్​కుమార్ వెల్లడించారు. వాస్తవికత నిర్ధారణ కోసం 9071666667కు వాట్సప్ చేయవచ్చని సీఐడీ ఏడీజీ సునీల్‌ కుమార్ తెలిపారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా తప్పుడు సమాచారాన్ని ఉంచుతున్నారు.

కొందరు గతంలో జరిగిన ఘటనలకు చెందిన చిత్రాలు, వీడియోలు జోడించి అవి కరోనాకు సంబంధించినవేనని పేర్కొంటూ పోస్టులు వైరల్ చేస్తున్నారు. వాట్సప్​లో ఫిర్యాదు చేసిన వెంటనే సంబంధిత ఫిర్యాదుదారుకు ఒక రిఫరెన్స్ సంఖ్యను పంపిస్తారు. 15మందితో కూడిన బృందం వీటిని పరిశీలిస్తోందని పేర్కొన్నారు. దాని ఆధారంగా ఆ ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకున్నారో తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరికొందరు తమను కించపరిచేలా పెట్టిన పోస్టులను తొలగించేలా చూడాలని విన్నవిస్తున్నారు. ఫిర్యాదుల ఆధారంగా అసత్య, అసభ్యకర వ్యాఖ్యలతో వేధించే వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories