తిరుమలగిరుల్లో తెరుచుకున్న దర్శనీయ క్షేత్రాలు

తిరుమల శ్రీవారి ఆలయం (ఫైల్ ఫోటో)
* కరోనా ప్రభావంతో దాదాపు 10 నెలలుగా మూతపడిన తీర్ధాలు * శ్రీవారి ప్రదేశాలను దర్శించుకునేందుకు భక్తులకు టీటీడీ అనుమతి * పుణ్య తీర్ధాలలో మొదలైన భక్తుల సందడి
తిరుమల గిరుల్లోని దర్శనీయ క్షేత్రాలు తెరుచుకున్నాయి. కరోనా ప్రభావంతో దాదాపు 10 నెలలుగా మూతపడిన తీర్ధాలు ఓపెన్ అయ్యాయి. శేషాచలం కొండల్లో దాగిన శ్రీవారి ప్రదేశాలను దర్శించుకునేందుకు భక్తులకు టీటీడీ అనుమతి ఇచ్చింది. దీంతో పుణ్య తీర్ధాలలో భక్తుల సందడి మొదలైంది. కరోనా ప్రభావంతో మూగబోయిన ఏడుకొండలు.. భక్తుల రాకతో ఓం శ్రీ నమో వెంకటేశాయ అనే నామస్మరణలతో మారుమోగుతున్నాయి.
కరోనా మహామ్మారి పుణ్యమని కలియుగ వైకుంఠం మూగబోయింది. దాదాపు 80 రోజుల పాటు ఏడుకొండల వాడు భక్తులు లేకుండా నిత్య కైంకర్యాలు అందుకున్నాడు. అన్‌లాక్ లో భాగంగా జూన్ 8న శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతి వచ్చింది. కానీ, తిరుమల గిరుల్లో మాత్రం భక్తుల సందడి కనిపించలేదు.. ఆ తర్వాత కోవిడ్ నిబంధనలు క్రమంగా తగ్గుతుండడంతో తిరుమలకు భక్తులు క్రమంగా పెరుగుతూ వచ్చారు.
అన్‌లాక్‌లో భాగంగా టీటీడీ శ్రీవారి దర్శనానికి మాత్రమే అనుమతి ఇచ్చింది కోవిడ్ నిబంధనల్లో మరిన్ని సడలింపులు రావడంతో శ్రీవారిని దర్శించుకునే భక్తులకు, ఇతర దర్శనీయ ప్రాంతాలనూ చూసే భాగ్యం కల్పించింది. పాపవినాశనం మార్గంలోని వేణుగోపాలస్వామి ఆలయం, జపాలీతీర్ధం, ఆకాశగంగ, గంగమ్మ ఆలయాన్ని చూసేందుకు టీటీడీ అనుమతి ఇచ్చింది..
శ్రీవారి పాదాల మార్గంలోని శిలాతోరణం, చక్రతీర్ధం సందర్శకులతో కళకళలాడుతున్నాయి. కరోనా ప్రభావంతో ఇంటికే పరిమితమైన భక్తులు శ్రీనివాసుని దర్శనంతో పాటు ఇతర తీర్ధాలనూ దర్శించుకుంటున్నారు.
శేషాచల అటవీ ప్రాంతంలో ప్రయాణిస్తూ ప్రకృతి సౌందర్యాల వీక్షిస్తూ సేద తీరుతున్నారు. జలపాతాలు, సెలయేర్ల సవ్వడులు, పక్షుల కిలకిలరావాలు, పచ్చని చెట్ల మధ్య కుటుంబ సభ్యులతో కొత్త మధురానుభూతులు పొందుతున్నారు.
తీర్థాలకు భక్తులను అనుమతిస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయంతో తమకు మళ్లీ ఉపాధి దొరికిందని ట్యాక్సీ డ్రైవర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కరోనాతో యాత్రికుల సందడి తగ్గిన తిరుమలలో క్రమంగా సాధారణ స్థితి వస్తోందని అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో ఆ ఏడుకొండల వాడి దర్శనం కోసం మరింత మంది భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు కృషి చేస్తామని టీటీడీ అధికారులు అంటున్నారు.
బాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMTపక్షుల కోసం ఆరంతస్తుల భవనం.. 2వేల పక్షులు నివసించే అవకాశం
27 Jun 2022 11:27 AM GMTBhimavaram: భీమవరంలో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు
27 Jun 2022 11:04 AM GMT
బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTIndian Air Force 2022: నిరుద్యోగులకి శుభవార్త.. ఇండియన్ ఎయిర్...
27 Jun 2022 3:30 PM GMTపవన్ సినిమాలో సాయితేజ్ కు యాక్సిడెంట్..?
27 Jun 2022 3:00 PM GMTHealth Tips: ఈ టీలు రక్తాన్ని శుభ్రపరుస్తాయి.. రోజు తాగితే చాలా...
27 Jun 2022 2:30 PM GMTరేపు పారిస్‌కు వెళ్లనున్న సీఎం జగన్
27 Jun 2022 2:15 PM GMT