అనంతపురానికి చేరుకున్న ప్రణయ్‌ మృతదేహం

* కెనడాలో ఆత్మహత్య చేసుకున్న ప్రణయ్ * ప్రేమ పేరుతో యువతి మోసం చేసిందని సూసైడ్ * 11 రోజుల తర్వాత స్వగ్రామానికి మృతదేహం * కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు, బంధువులు

Neeta Gurnale
Updated on: 25 Nov 2020 1:17 PM IST
అనంతపురానికి చేరుకున్న ప్రణయ్‌ మృతదేహం
X

ప్రేమ పేరుతో ఓ యువతి మోసం చేసిందని.. కెనడాలో ఆత్మహత్యకు పాల్పడిన అనంతపురం యువకుడు ప్రణయ్ మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. ప్రణయ్ మృతదేహాన్ని చూసిన కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రణయ్‌ చావుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన అఖిల అనే యువతి ప్రేమ పేరుతో ప్రణయ్‌కు దగ్గరైంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కొంతకాలానికి తనను అఖిల మోసం చేస్తోందని ప్రణయ్‌ గ్రహించాడు. అఖిల వ్యవహారశైలిని ఓ వీడియోలో వివరించాడు. అనంతరం నైట్రోజన్‌ వాయువు పీల్చి ఆత్మహత్య చేసుకున్నాడు ప్రణయ్.


Neeta Gurnale

Neeta Gurnale

Next Story