సుపరిపాలన సూచీలో తెలుగు రాష్ట్రాల ర్యాంకింగ్‌ ఎంతో తెలుసా?

సుపరిపాలన సూచీలో తెలుగు రాష్ట్రాల ర్యాంకింగ్‌ ఎంతో తెలుసా?
x
Highlights

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకుని సుపరిపాలన దినోత్సవం సందర్భంగా సుపరిపాలన అందిస్తున్న రాష్ట్రాల జాబితాను విడుదల చేసింది.

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకుని సుపరిపాలన దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, మంత్రి ఇన్‌ఛార్జి డిఓపిటి (సిబ్బంది మరియు శిక్షణ విభాగం) సుపరిపాలన అందిస్తున్న రాష్ట్రాల జాబితాను విడుదల చేసింది. వ్యవసాయం.. అనుబంధ రంగాలు, వాణిజ్యం, పరిశ్రమలు, మానవ వనరుల అభివృద్ధి, ప్రజారోగ్యం, ప్రభుత్వ మౌలిక వసతులు, సదుపాయాలు, ఆర్థిక పాలన, సామాజిక సంక్షేమం, అభివృద్ధి తదితర అంశాల్లో సర్వే చేసి ఈ సూచీని విడుదల చేసింది. సుపరిపాలన సూచీలో ఆంధ్రప్రదేశ్ 5 స్థానం దక్కగా తెలంగాణకు 11 స్థానం దక్కింది.

పెద్ద రాష్ట్రాల్లో 5.62 మార్కులతో తమిళనాడు మొదటి స్థానంలో నిలవగా.. 4.23 మార్కులతో జార్ఖండ్ చివరి స్థానంలో ఉంది. మౌలిక వసతులు, సదుపాయాల్లో 0.66 మార్కులతో ఆంధ్రప్రదేశ్‌ 8 స్థానంలో నిలవగా.. 0.70 స్కోర్‌తో తెలంగాణ ఆరో స్థానంలో నిలిచింది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఏపీ 0.48 మార్కులతో 6వ స్థానం దక్కించుకుంది. అలాగే 0.29 మార్కులతో తెలంగాణ 17వ స్థానంలో నిలిచింది.

ప్రజారోగ్యం విషయంలో 0.63 మార్కులతో ఆంధ్రప్రదేశ్‌ 7, 0.63 స్కోర్‌తో తెలంగాణ 8దో స్థానాల్లో కొనసాగుతున్నాయి. పరిశ్రమలు, వాణిజ్యంలో 0.94 మార్కులతో ఆంధ్రప్రదేశ్‌ 2, 0.93 మార్కులతో తెలంగాణ 3స్థానం పొందాయి. అయితే మానవ వనరుల అభివృద్ధిలో 0.58 మార్కులతో ఆంధ్రప్రదేశ్‌ తొమ్మిదో స్థానంలో నిలవగా.. 0.55 స్కోర్‌తో తెలంగాణ 11వ స్థానంలో నిలిచింది. 0.63 స్కోర్‌తో ఆర్థిక పాలనలో ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో ఉండగా.. 0.55 స్కోర్‌తో తెలంగాణ మూడో స్థానంలో కోనసాగుతోంది.

సామాజిక సంక్షేమం, అభివృద్ధి విషయంలో 0.57 స్కోర్‌తో ఆంధ్రప్రదేశ్‌ మూడు, 0.46 స్కోర్‌తో తెలంగాణ ఎనిమిది స్థానాల్లో నిలిచాయి. న్యాయ, ప్రజాభద్రతలో 0.30 స్కోర్‌తో ఆంధ్రప్రదేశ్‌ తొమ్మిదో స్థానంలో నిలవగా, 0.22 స్కోర్‌తో తెలంగాణ 16వ స్థానంలో నిలిచింది. పర్యావరణంలో 0.49 స్కోర్‌తో తెలంగాణ, 0.40 స్కోర్‌తో ఆంధ్రప్రదేశ్‌ 17 స్థానాలు సాధించడం విశేషం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories