రేపు సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ

రేపు సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ
x
YS Jagan (File Photo)
Highlights

మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సినీ పెద్దల సమావేశం జరగనుంది. ఈ సందర్బంగా ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి, అలాగే కోవిడ్ అనంతరం సినిమా షూటింగ్ లపై...

మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సినీ పెద్దల సమావేశం జరగనుంది. ఈ సందర్బంగా ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి, అలాగే కోవిడ్ అనంతరం సినిమా షూటింగ్ లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చర్చించనున్నట్టు తెలుస్తోంది. 9వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరగనుంది.

ఈ సమావేశానికి మెగాస్టార్‌ చిరంజీవి, నాగార్జున, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, జెమిని కిరణ్, రాజమౌళి, జీవిత, త్రివిక్రమ్, కొరటాల శివ, సి.కళ్యాణ్, దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్‌లతో పాటు మొత్తం 25 మంది పాల్గొంటారు.. అయితే జూన్‌ 10న నందమూరి బాలకృష్ణ 60వ పుట్టినరోజు వేడుకలు ఉండటంతో ఆయన ఈ సమావేశానికి హాజరు కావడం లేదు. కాగా, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో సినిమా, టీవీ షూటింగులకు అనుమతించిన సంగతి తెలిసిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories