ఏపీలో టీడీపీకి మరో షాక్‌!

Christian Cell Members Resigned to TDP
x

Telugu Desam Party Emblem (file Image)

Highlights

* 13 జిల్లాల టీడీపీ క్రిస్టియన్‌ సెల్ ప్రతినిధుల రాజీనామా * మూకుమ్మడిగా పార్టీకి రాజీనామాలు చేసిన సభ్యులు * చంద్రబాబు వ్యాఖ్యలు బాధించాయి: టీడీపీ క్రిస్టియన్‌ సెల్ ప్రవీణ్

ఏపీలో టీడీపీకి మరో షాక్‌ తగిలింది. క్రిస్టియన్లపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పార్టీకి రాజీనామా చేశారు క్రిస్టియన్ సెల్ సభ్యులు. ఎంతోకాలంగా పార్టీ కోసం పని చేస్తున్నామని చంద్రబాబు క్రైస్తవ సమాజాన్ని అవమానించేలా మాట్లాడారన్నారు. రాష్ట్రంలోని చర్చి ఫాదర్‌లకు 5వేలు ఇస్తే తప్పుపట్టడం దేనికని ప్రశ్నించారు. మతమార్పిడి విషయంలో కూడా క్రిస్టియన్లను అవమానించారని బలవంతంగా మాతమార్పిడిలు చేస్తున్నట్టు నిరూపించాలని చంద్రబాబుపై మండిపడ్డారు. పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్న తమపై చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదన్న 13 జిల్లాల టీడీపీ క్రిస్టియన్ సెల్ ప్రతినిధులు మూకుమ్మడిగా పార్టీకి రాజీనామాలు చేస్తున్నట్టు స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories