చంద్రబాబుపై తలసాని ఘాటు వ్యాఖ్యలు

చంద్రబాబుపై తలసాని ఘాటు వ్యాఖ్యలు
x
తలసాని శ్రీనివాస్ ఫైల్ ఫోటో
Highlights

గత సర్కార్ పొరపాట్ల వల్లే ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని సమస్య తలెత్తిందన్నారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

గత సర్కార్ పొరపాట్ల వల్లే ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని సమస్య తలెత్తిందన్నారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఏపీ రాజధాని విషయంతో శాశ్వత పరిష్కారం ఉండాలని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మంత్రి తలసాని శ్రీనివాస్ సందడి చేశారు. స్థానికులతో కలిసి కోడి పందేల పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్నేహితులతో కలిసి ఉల్లాసంగా గడిపారు. ఈ కార్యక్రమంలో వైసీసీ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన తలసాని శ్రీనివాస్.. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమేత్తారు. జోలె పట్టుకొని భిక్షమెతుకునే నాయకులను నమ్మకండని సూచించారు. అలాంటి నాయకులను నమ్మితే కుక్క తోకతో గోదారి ఇదుతున్నట్లే ఉంటుందన్నారు. రైతులు సంతోషంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. రాజధాని విషయంలో రైతులకు కొంత ఆందోళన ఉంది. ప్రభుత్వంలో చర్చలు జరపాలి అలానే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుందిని తెలిపారు. రాజధాని అంశం పూర్తిగా ప్రజలకు ప్రభుత్వానికి సంబంధించినది తానే ఏమి మాట్లాడనని స్పష్టం చేశారు. ప్రభుత్వంతో ఉంటే అమరావతి రైతులకు సమస్య పరిష్కారం అవుతుందన్నారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ప్రశంసలు గురిపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీకి మంచి ఫలితాలే వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. జగన్ ప్రజల ఆకలి తెలిసినవాడని వ్యాఖ్యానించారు. నిర్దాక్షిణ్యంగా దేన్నీ తొలిగించే పరిస్థితి ఉండదు. అంతా మంచి జరుగుతుంది అని తలసాని వ్యాఖ్యానించారు. తాను ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగకు ఇక్కడకు వస్తాను , గోదావరి జిల్లాలో సంక్రాంతికి పండగ బాగా నిర్వహిస్తారని, సాంప్రదాయంగా జరుపుతారని మంత్రి తలసాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మంతెన రామరాజు, వైసీపీ నేతలు హాజరయ్యారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories