Telangana: ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

Telangana: ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
x
Highlights

కరోనా వైరస్‌ వ్యాప్తి లాక్‌డౌన్‌ అమల్లోకి రావడంతో రాష్ట్రంలో వాయిదా పడిన ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించేందుకు టీఎస్ ఇంటర్మీడియట్‌ బోర్డు రెడీ అయ్యారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి లాక్‌డౌన్‌ అమల్లోకి రావడంతో రాష్ట్రంలో వాయిదా పడిన ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించేందుకు టీఎస్ ఇంటర్మీడియట్‌ బోర్డు రెడీ అయ్యారు. ఈ పరీక్షలు మార్చి 23న జరగాల్సి ఉండగా కరోనా కారణంగా ఈ రెండు పరీక్షలు వాయిదా పడ్డాయి. తిరిగి ఈ పరీక్షలకు సంబందించిన షెడ్యూల్ విడుదల చేసారు.

ఈ మేరకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్ ఓ ప్రకటనలో తెలిపారు. లాక్ డౌన్ సందర్భంగా వాయిదా పడిన పరీక్షలకు సంబంధించిన తేదీలను ప్రకటించారు. జూన్‌ 3న ఇంటర్‌ రెండో సంవత్సరం జాగ్రఫీ, మోడరన్‌ లాంగ్వేజ్‌ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పాత హాల్‌టికెట్ల నంబర్లతో గతంలో కేటాయించిన కేంద్రాల్లోనే పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. 3వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories