ఏపీ, తెలంగాణ ఎమ్మెల్యేల మధ్య ముదిరిన మాటలయుద్ధం.. శ్రీశైలం రావాలంటే నాకు మూడు గంటలే ‌: రాజాసింగ్

ఏపీ, తెలంగాణ ఎమ్మెల్యేల మధ్య ముదిరిన మాటలయుద్ధం.. శ్రీశైలం రావాలంటే నాకు మూడు గంటలే ‌: రాజాసింగ్
x

శిల్పా చక్రపాణి రెడ్డి, రాజాసింగ్ ఫైల్ ఫోటో

Highlights

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. శిల్పా చక్రపాణి రెడ్డి సవాల్ పై రాజాసింగ్ స్పందించారు.

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. శ్రీశైలం దేవస్థానం దుకాణాల కేటాయింపులో ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తున్నారని.. దీని వెనుక వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణికి హస్తం ఉన్నట్లు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపణలు చేశారు. రాజాసింగ్ మాటలకు వైసీపీ ఎమ్మెల్యే ఘాటుగానే రిప్లై ఇచ్చారు. రాజాసింగ్ తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని , శ్రీశైలంలో పెద్దల సమక్షంలో చర్చకు సిద్ధమేనా అంటూ రాజాసింగ్ కు సవాల్ విసిరారు.

అయితే శిల్పా చక్రపాణి రెడ్డి సవాల్ పై రాజాసింగ్ స్పందించారు. తాను శ్రీశైలం మూడు గంటల్లో చేరుకోగలనని, ఎప్పుడు రావాలో తనకు తెలుసని తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా శ్రీశైలంలో అన్యమతస్తులకు కేటాయించిన దుకాణాల జాబితాను రాజాసింగ్ వెల్లడించారు. అక్రమాలపై ప్రశ్నిస్తే నోరు కోసేస్తామని వైసీపీ ఎమ్మెల్యే అంటున్నారని, తాము తలుచుకుంటే క్షేత్రానికి దేశం మొత్తం తరలివస్తుందని హెచ్చరించారు.

రజాక్ భార్య గోశాల ఇన్చార్జిగా ఉన్నప్పుడు మూడు వందల ఆవులు మరణించాయని రాజాసింగ్ ఆరోపించారు. శిల్పా ఇప్పటికైనా కళ్లు తెరవాలని, శ్రీశైలం ఆలయంలో ఎవరి అండతో రజాక్ రెచ్చిపోతున్నాడో శిల్పా చక్రపాణిరెడ్డి సమాధానం చెప్పాలని నిలదీశారు. అంతేకాదు, ఆలయ ప్రాంగణంతోపాటు ఈవో ఆఫీసులో అన్యమతస్తులు సంచరిస్తున్న చిత్రాలను కూడా విడుదల చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories