సంచలన నిర్ణయం తీసుకున్న లాలూ కుమారుడు

సంచలన నిర్ణయం తీసుకున్న లాలూ కుమారుడు
x
Highlights

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆర్జేడీలో ముసలం మొదలయింది. ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు, బిహార్‌ మాజీ హోమ్ మంత్రి తేజ్‌...

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆర్జేడీలో ముసలం మొదలయింది. ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు, బిహార్‌ మాజీ హోమ్ మంత్రి తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆర్జేడీ విద్యార్థి విభాగం అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్నీ తన అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'అమాయకులే నన్ను అమాయకుడని అనుకుంటారు. కానీ గ్రౌండ్‌ లెవల్‌లో అందరి గురించి, అన్ని విషయాలు తెలుసు'అంటూ ట్విట్టర్ లో ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా తన సోదరుడికి తనకు ఎలాంటి విబేధాలు లేవని తన తమ్ముడు తన హృదయానికి దగ్గరగా ఉంటారని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories