logo
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు జిల్లాలో కావ్య హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం

Techie Shoots Woman Over Love Failure in Nellore
X

నెల్లూరు జిల్లాలో కావ్య హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం

Highlights

Nellore: కావ్యను గన్‌తో కాల్చి తాను కాల్చుకున్న సురేష్‌ రెడ్డి

Nellore: నెల్లూరు జిల్లాలో జరిగిన కావ్య హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదన్న కోపంతో కావ్యను సురేశ్ తుపాకీతో కాల్చి, తనూ కాల్చుకుని చనిపోయాడు. మృతదేహాలను నెల్లూరు జీజీహెచ్ కు తరలించారు. కాసేపట్లో కావ్య, సురేశ్ మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగి సురేష్‌కు గన్ ఎలా వచ్చిందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇప్పటికే మృతుని వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు సురేష్ స్నేహితుల వివరాలు సేకరిస్తున్నారు. పక్కా ప్రణాళికతోనే సురేష్ రెడ్డి, కావ్యను హత మార్చినట్లు ప్రాథమిక నిర్థారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అక్రమ మార్గంలో పిస్తోల్ను కొనుగోలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Web TitleTechie Shoots Woman Over Love Failure in Nellore
Next Story