Top
logo

ఉద్యోగ,ఉపాధ్యాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా

ఉద్యోగ,ఉపాధ్యాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా
X
ఐక్య కార్యాచరణ సమితి నియోజకవర్గ చైర్మన్ శ్రీనివాసులు తదితరులు
Highlights

పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

బద్వేల్ : పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐక్య కార్యాచరణ సమితి నియోజకవర్గ చైర్మన్ శ్రీనివాసులు, యుటిఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విజయ్ కుమార్, ఎస్టీయు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింత రెడ్డి రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ 11వ పీఆర్సీ ఫిట్మెంట్ అమలు చేయాలని, సీపీఎస్ రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.

అలాగే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలనెలా జీతాలు ఇవ్వాలని, అంతర జిల్లాల బదిలీలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్య క్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సంఘాల సభ్యులు పాల్గొన్నారు.


Web TitleTeachers Dharna at Tahsildar's Office
Next Story