TDP Warning Ignored: హెచ్చరించినా మార్పురాని టీడీపీ ఎమ్మెల్యేల జాబితా సిద్ధం

TDP Warning Ignored: హెచ్చరించినా మార్పురాని టీడీపీ ఎమ్మెల్యేల జాబితా సిద్ధం
x
Highlights

TDP internal politicsలో కీలక పరిణామం. హెచ్చరికలు ఇచ్చినా మార్పు రాని టీడీపీ ఎమ్మెల్యేల జాబితా సిద్ధమైంది. చంద్రబాబు ఆదేశాల తర్వాత పార్టీ లోపల జరుగుతున్న చర్చలపై పూర్తి వివరాలు.

ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ రాజకీయాలపై ఇప్పుడు వేడి వేడిగా చర్చ సాగుతోంది. ఈ చర్చ అంతా హద్దులు దాటిన టీడిపి ఎమ్మెల్యేల పనితీరుపై జరుగుతోంది. ఆ పార్టీలో ఇంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై ఇంతకుముందు ఇంత చర్చ ఎప్పుడూ జరగలేదు. చాలా మంది ఎమ్మెల్యేల ప్రవర్తన తీరుపై మొదటి ఆరు నెలలలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడం మాత్రమే కాకుండా పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుతీరు మార్చుకోమని వారిని హెచ్చరించారు. కొంతమంది ఎమ్మెల్యేలు బాగా రెచ్చిపోతున్నారని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. దాంతో ఆ ఎమ్మెల్యేల పైన సీఎం చంద్రబాబు అసంతృప్తి ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ సందర్భంలో అధికార పార్టీలో బాధ్యత లేకుండా వ్యవరించే కొంతమంది ఎమ్మెల్యేల జాబితాని అధిష్టానం సిద్ధం చేయమన్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాల వారీగా ఈ ఎమ్మెల్యేల జాబితాపై దృష్టి పెట్టారనే రాజకీయ వార్తల సమాచారం ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేల విషయంలో ఉమ్మడి జిల్లాల వారీగా ఈ ఎమ్మెల్యేల జాబితాపై దృష్టి పెట్టారనే రాజకీయ వర్గాల సమాచారం. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేల విషయంలో సీఎం చంద్రబాబు వన్ టు వన్ మాట్లాడారు. సీఎం తో మాట్లాడిన తర్వాత కొంతమంది తమ వ్యవహారశాలిని మార్చుకున్నారు. ఇంకా కొంతమంది పరిస్థితుల్లో మార్పు రాలేదని అధిష్టానం వద్ద సమాచారం ఉంది. తాజాగా అందిన నివేదికలో కొంతమందిలో ఎలాంటి మార్పు లేదు అని పైగా కొంతమంది మరీ రెచ్చిపోతున్నట్టు తెలుస్తుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వారిలో కొంతమంది చాలా దురుసుగా వ్యవహరిస్తున్నారు. అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు పిఏలు మరి బరితెగించినట్టు ప్రవర్తిస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు తమ సామాజిక వర్గం వారినే పిఎస్ గా పెట్టుకొని ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్ల అన్ని విషయాల్లో వాళ్ళు తలదూరుస్తున్నట్టు ఫిర్యాదులు అందినట్లు పార్టీలో చర్చ జరుగుతుంది. ఇటువంటి వారి వల్ల పార్టీ భారి స్థాయిలో నష్టపడే పరిస్థితులు ఏర్పడినట్టు పార్టీ వర్గాలు గగ్గలు పెడుతున్నాయి. నంద్యాల లోక్సభ స్థానంలో ఐదుగురు ఎమ్మెల్యేల పైన తీవ్ర ఆరోపణలను వినిపిస్తున్నాయి. వారి పనితీరుపై పార్టీ కార్యకర్తలు ఫిర్యాదులు చేస్తున్నట్టు సమాచారం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎనిమిది మంది, విజయనగరం జిల్లాలో ఐదుగురు, నెల్లూరులో నలుగురు, ప్రకాశంలో ముగ్గురు, శ్రీకాకుళం జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు ఈ జాబితలో ఉన్నట్లు సమాచారం. పార్టీలో కీయక బాధ్యుడిగా ఉంటున్న మానవ వనరుల అభివృద్ధి, విద్య, ఐటి ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆ ఎమ్మెల్యేల అందరితో సమావేశమై వారికి క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తుంది. కొత్త సంవత్సరంలో మంత్రి లోకేష్ ఈ కార్యక్రమం మొదలు పెట్టే అవకాశం ఉంది. ఈ స్థాయిలో ఎమ్మెల్యేల పైన అసంతృప్తి ఉంటే పరిస్థితి చేయజారిపోయే ప్రమాదం ఉందని జాగ్రత్త చర్యలు చేపడుతుంది. వారిని తీవ్ర స్థాయిలో హెచ్చరించి దారిలో పెట్టాలని పార్టీ అధిష్టానం ఆలోచిస్తోంది. అప్పటికీ మార్పు రాకపోతే వచ్చే ఎలక్షన్స్ లో వారికి టికెట్లు తిరస్కరించే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories