అసెంబ్లీ నుంచి టీడీపీ వాకౌట్

అసెంబ్లీ నుంచి టీడీపీ వాకౌట్
x
Highlights

ఏపీ అసెంబ్లీ నుంచి తెలుగుదేశం పార్టీ వాకౌట్ చేసింది. ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం ఇస్తున్న సమాధానాలు వాళ్ళను సంతృప్తి పరిచేలా లేవని ఆరోపిస్తూ.. టీడీపీ...

ఏపీ అసెంబ్లీ నుంచి తెలుగుదేశం పార్టీ వాకౌట్ చేసింది. ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం ఇస్తున్న సమాధానాలు వాళ్ళను సంతృప్తి పరిచేలా లేవని ఆరోపిస్తూ.. టీడీపీ సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు. తమ హయాంలో 85 శాతం పూర్తి చేసిన ఇళ్ల నిర్మాణాలను వైసీపీ ప్రభుత్వం ఆపేసిందని.. ప్రస్తుతం ఆ పనులను హైదరాబాదుకు చెందిన చిన్న కంపెనీలకు అప్పజెబుతున్నారని టీడీపీ సభలో వాదించింది.

టీడీపీ లేవనెత్తిన అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ వివరణ ఇచ్చారు. సభలో టీడీపీ అన్నీ అబద్ధాలే చెబుతోందని బొత్స మండిపడ్డారు. ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందని... అందుకే రివర్స్ టెండరింగ్ కు వెళ్లామని స్పష్టం చేశారు. అంతేకాని జాబితా నుంచి అర్హులైన లబ్ధిదారులను తొలగించలేదని అన్నారు. ఇళ్ల నిర్మాణం విషయంలో టీడీపీ దుష్ఫ్రచారం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రివర్స్ టెండరింగ్ వల్ల ప్రతి ఇంటికి రూ. 75 వేలు ఆదా అయిందని మొత్తం రూ. 150 కోట్లు ప్రభుత్వ సొమ్ము మిగిలిందని మంత్రి సమాధానం ఇచ్చారు. దీంతో మంత్రి బొత్స సమాధానం సరిగా లేదని ఆరోపిస్తూ.. టీడీపీ సభనుంచి వాకౌట్ చేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories