Mangalagiri: నేడు మరోసారి తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశం

Mangalagiri: నేడు మరోసారి తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశం
x
Highlights

నేడు మరోసారి తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. నిన్నటి టీడీఎల్పీ లో అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు.

నేడు మరోసారి తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. నిన్నటి టీడీఎల్పీ లో అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే మండలి రద్దు వార్తల నేపథ్యంలో ఇవాళ మరోసారి సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి టీడీపీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు హాజరు కావాలని పార్టీ ఆదేశించింది. మధ్యాహ్నం 1 గంట తరువాత ఈ సమావేశం ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం. సమావేశంలో భాగంగా మండలి రద్దు ప్రచారం, సభలో వ్యూహంపై నిశితంగా చర్చించనున్నారు.

కాగా నిన్నటి టీడీఎల్పీ సమావేశంలో రెండు సినిమా సన్నివేశాలను ఇరువురు సబ్యులకు చూపించింది టీడీపీ. ప్రభుత్వ నిర్ణయాలను పోలుస్తూ ఉండే ఆ వీడియోలు దాదాపు అరగంట పాటు ప్రదర్శించారు. ఢిల్లీ నుంచి దౌల్తాబాద్‌కు రాజధానిని మార్చిన మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ సినిమాతోపాటు ప్రజలను హింసించే 23వ రాజు పులికేసి సినిమా క్లిప్పింగులను ప్రదర్శించారు.. సినిమా సన్నివేశాలను చూసి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నవ్వుకున్నారు.. రాష్ట్రంలో పరిపాలన ఇదే విధంగా ఉందంటూ వైసీపీ ప్రభుత్వంపై ఎద్దేవా చేశారు.

ఇక మండలిలో టీడీపీకి 32 మంది ఎమ్మెల్సీలుండగా నిన్న టీడీఎల్పీ సమావేశానికి 23 మంది హాజరయ్యారు. సమావేశానికి హాజరుకాలేమని ఆరుగురు ఎమ్మెల్సీలు ముందుగానే అధిష్టానానికి సమాచారం ఇచ్చారు. గాలి సరస్వతి, కేఈ ప్రభాకర్, తిప్పేస్వామి, శత్రుచర్ల విజయరామరాజు, ఏఎస్‌ రామకృష్ణ, శమంతకమణి ఈ ఆరుగురు నిన్నటి సమావేశానికి గైర్హాజరయ్యారు. పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథరెడ్డిలు ఇప్పటికే టీడీపీని వీడారు. మరో ఎమ్మెల్సీ డొక్కా ఏకంగా ఎమ్మెల్సీ పదవికి, టీడీపీకి రాజీనామా చేశారు.

తాజా పరిణామాలపై ఎమ్మెల్సీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకరిద్దరు ఎమ్మెల్సీలు ప్రభుత్వంతో చేతులు కలిపేందుకు ప్రయత్నించగా వైసీపీనే వారిని దూరం పెట్టినట్టు తెలుస్తోంది. గతంలో వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీ లో చేర్చుకోవడంతో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు జగన్ పై కూడా అలంటి విమర్శలే వస్తాయని వైసీపీ భావిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories