టీడీపీకి యామిని గుడ్ బై

sadineni yamini
x
sadineni yamini
Highlights

ఏపీలో టీడీపీ మరోషాక్ తగిలింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి ఫైర్ బ్రాండ్ సాధినేని యామిని గుడ్ బై చెప్పారు.

ఏపీలో టీడీపీ మరోషాక్ తగిలింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి ఫైర్ బ్రాండ్ సాధినేని యామిని గుడ్ బై చెప్పారు. ఈ మేరకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఆమె లేఖను పంపారు. టీడీపీ వాట్సప్ గ్రూప్‌లో రాజీనామా లేఖను పోస్టు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రశంసలు గురిపించారు. ఒక నాయకుడికి ఉండాల్సిన ఓర్పు, సహనం, చాణక్యత, ప్రజల పట్ల తపన చంద్రబాబులో చూశానని పేర్కొన్నారు.

చంద్రబాబును చూసి నాయకురాలిగా తాను మలుచుకున్నానని పేర్కొ్న్నారు. వ్యక్తిగత కారణాలే కాకుండా ఇతర కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. సాధినేని యామిని గతంలోనే ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిశారు. అప్పుడే ఆమె పార్టీని వీడుతారని ప్రచారం సాగింది. అయితే ఆమె తప్పుడు ప్రచారమని వార్తలను నమ్మెుదని తెలిపింది. అనూహ్యంగా ఆమె రాజీనామా చేయడం టీడీపీ శ్రేణులకు మింగుడుపడడం లేదు. సాధినేని యామిని బీజేపీలో చేరే అవకాశం ఉంది. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో నవంబర్ 10న బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories