ఇంగ్లీష్ విద్యను మతానికి లింకు పెట్టడం తప్పు : టీడీపీ నేత

ఇంగ్లీష్ విద్యను మతానికి లింకు పెట్టడం తప్పు : టీడీపీ నేత
x
Highlights

ఇంగ్లీష్ విద్యను మతానికి లింకు పెట్టడం సరికాదన్నారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనందబాబు. ఇది ఎక్కడా కూడా ఆర్గుమెంటుకు నిలబడనటువంటి అంశం...

ఇంగ్లీష్ విద్యను మతానికి లింకు పెట్టడం సరికాదన్నారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనందబాబు. ఇది ఎక్కడా కూడా ఆర్గుమెంటుకు నిలబడనటువంటి అంశం అన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టడానికి వ్యతిరేకం కాదన్నారు. ఇంగ్లీష్ బాష కేవలం బ్రతుకుదెరువు కోసమే అని వ్యాఖ్యానించారు.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ పిల్లలు ఎక్కడా చదువుతున్నారని వైసీపీ ప్రశ్నిస్తోంది.

మరి ముఖ్యమంత్రి జగన్ గారి కూతుళ్లు లండన్ లో చదువుతున్నారన్న విషయం మాకు తెలియదా అని అన్నారు. ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో ఇంగ్లీష్ విద్య అవసరమని తేల్చి చెప్పారు. దీనిని గుర్తించే 2017 లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మునిసిపల్ పాఠశాలలో ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. కాగా ఇంగ్లీష్ మీడియం విద్యను ఒక మతం కోసమే ప్రవేశపెడుతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories