కెనాల్ రోడ్డు దుస్థితిపై టీడీపీ నిరసన

TDP protest against the plight of Canal Road
x

కెనాల్ రోడ్డు దుస్థితిపై టీడీపీ నిరసన

Highlights

* కనీసం రోడ్లు నిర్మించలేని జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను ఎలా నిర్మిస్తారని రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు.

East Godavari District: తూర్పుగోదావరి జిల్లా ధవలేశ్వరం సామర్లకోట కెనాల్ రోడ్డు దుస్థితిపై అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిరసనకు దిగారు. గుంతలు పడ్డ కెనాల్ రోడ్డుపై కార్యకర్తలతో బైఠాయించి ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే అధికారం చేపట్టి మూడున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు కెనాల్ రోడ్డు నిర్మాణంపై దృష్టి సారించలేదని దుయ్యబట్టారు. తూతూ మంత్రంగా మరమ్మతులు చేసినా, నెలరోజులు కూడా కాకుండానే రోడ్లు మళ్లీ శిథిలావస్థకు చేరుకున్నాయని ఆరోపించారు. తక్షణమే కెనాల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కనీసం రోడ్లు నిర్మించలేని జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను ఎలా నిర్మిస్తారని రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories