'ప్రభుత్వ మోసాలను వివరించేందుకే ప్రజా చైతన్య యాత్ర'

ప్రభుత్వ మోసాలను వివరించేందుకే ప్రజా చైతన్య యాత్ర
x
Highlights

వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ తో రాష్ట్రాభివృద్ధిని వెనక్కి నెట్టుతోందని తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడ్డారు.

రాజమహేంద్రవరం: వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ తో రాష్ట్రాభివృద్ధిని వెనక్కి నెట్టుతోందని తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడ్డారు. తొమ్మిది నెలల జగన్ పరిపాలనా కాలంలో తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుందని విమర్శించారు. శనివారం స్థానిక 50వ డివిజన్లోని సువిశేషపురం వాటర్ ట్యాంకుల దగ్గర నుంచి స్థానిక నాయకులు మరుకుర్తి రవియాదవ్ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర జరిగింది. ముందుగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ తెలుగదేశం పార్టీ జెండాను ఎగుర వేసి యాత్రను ప్రారంభించారు.

అనంతరం ఎమ్మెల్యే భవానీ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడా మాజీ ఛైర్మన్ గన్ని కృష్ణ, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు), ఎస్సీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కాశి నవీన్ తదితర నాయకులు ఆ డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ మోసాలను వివరించేందుకే ఈ యాత్ర నిర్వహిస్తున్నామని వారువివరించారు. ప్రతి ఇంటి తలుపు తట్టి సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories