ఆ ముగ్గురు నేతలకు కీలక పదవులు

ఆ ముగ్గురు నేతలకు కీలక పదవులు
x
Highlights

ఆ ముగ్గురు నేతలకు కీలక పదవులు ఆ ముగ్గురు నేతలకు కీలక పదవులు

నేడు టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం జరగనుంది. గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశానికి ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు హాజరుకానున్నారు. ఈ సందర్బంగా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కార్యక్రమం జరగనుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. సమావేశంలో ముందుగా టీడీపీ సంస్థాగత ఎన్నికల కమిటీని ఏర్పాటు చేస్తారు.

దాంతో కమిటీ కన్వీనర్‌, సభ్యులను పొలిట్‌బ్యూరో భేటీలో నిర్ణయించనున్నట్టు సమాచారం. అయితే ఈసారి పొలిట్‌బ్యూరోలో కొత్తగా ముగ్గురికి చోటు లభించింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వర్ల రామయ్యను ఎస్సి కోటా నుంచి, తెలుగుదేశం శాసనసభాపక్ష ఉప నేతలు ముగ్గురిలో బీసీ నేత అయిన అచ్చెన్నాయుడు, కమ్మ సామాజిక వర్గంనుంచి పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌ లకు ఆహ్వానితుల జాబితాలో చోటు దక్కింది.

Show Full Article
Print Article
Next Story
More Stories