నేడు ఒంగోలులో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం

TDP Politburo Meeting in Ongole Today | AP News
x

నేడు ఒంగోలులో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం

Highlights

*సాయంత్రం 4గంటలకు చంద్రబాబు అధ్యక్షతన సమావేశం

Ongole: తెలుగుదేశం పార్టీ ఒంగోలు వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా మహానాడును నిర్వహించనుంది. రేపు, ఎల్లుండు టీడీపీ మహానాడు కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే టీడీపీ శ్రేణులు భారీగా నిర్వహించనున్న మహానాడు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గత రెండేళ్లు కరోనా మహమ్మారి కారణంగా వర్చువల్‌గా మహానాడు కార్యక్రమం నిర్వహించగా ఈ దఫా బహిరంగ సభను నిర్వహించనుంది.

తెలుగుదేశం పార్టీ మహానాడులో ఆమోదించవలసిన తీర్మానాలపై ఇవాళ చంద్రబాబు అధ్యక్షతన పోలిట్ బ్యూరో సమావేశం నిర్వహించనున్నారు. రేపట్నుంచి నుంచి ప్రారంభం కానున్న మహానాడు సమావేశాల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్నిక, ఇతర అంశాలపై కూడా పోలిట్ బ్యూరో సమావేశంలో చర్చించనున్నారు. ఇక రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మహానాడు వేదికగా చేయవలసిన పలు కీలక ప్రకటనలు, రాబోయే ఎన్నికలలో యువత, మహిళలకు ప్రాధాన్యత నివ్వడం, ఇతరత్రా అంశాలపై కూడా చర్చించనున్నారు.

తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు, బాదుడే బాదుడు కార్యక్రమం జరుగుతున్న తీరు, ఏపీలో ముందస్తు ఎన్నికల అవకాశం, ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ పరిణామాలపై పోలిట్ బ్యూరోలో ప్రస్తావించనున్నారు. ఒకపక్క చంద్రబాబు బాదుడే బాదుడు ల్లాల యాత్రలు కొనసాగిస్తూనే మరోపక్క మహానాడు ఏర్పాట్లను మానిటర్ చేస్తున్నారు. మొత్తంగా మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ రానున్న ఎన్నికల సమర శంఖాన్ని పూరించాలన్న ఉద్దేశంతో ముందుకు వెళుతున్నట్లుగా తెలుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories