జగన్ అన్న నువ్వు సూపర్ : టీడీపీ ఎంపీ కేశినేని నాని

జగన్ అన్న నువ్వు సూపర్ : టీడీపీ ఎంపీ కేశినేని నాని
x
టీడీపీ ఎంపీ కేశినేని నాని
Highlights

కొద్దిరోజులుగా ట్విట్టర్‌కు టీడీపీ ఎంపీ కేశినేని నాని కాస్త దూరంగా ఉంటున్నారు. ఇటీవలే మళ్లీ తన ట్విటర్ అకౌంట్ లో పోస్టులను చేయడం ప్రారంభించారు. మూడు...

కొద్దిరోజులుగా ట్విట్టర్‌కు టీడీపీ ఎంపీ కేశినేని నాని కాస్త దూరంగా ఉంటున్నారు. ఇటీవలే మళ్లీ తన ట్విటర్ అకౌంట్ లో పోస్టులను చేయడం ప్రారంభించారు. మూడు రాజధానుల ప్రకటన తర్వాత మళ్లీ యాక్టివ్ అయ్యారు. అందులో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ గురించి జగన్ అన్న నువ్వు సూపర్ అంటూ ట్వీట్ చేసారు. దీంతో చాలా మంది పార్టీ కార్యకర్తలు ఒక్క సారిగా ఆశ్చర్యపోయారు. అదేంటి ప్రత్యర్థి పార్టీ ఎంపీ జగన్‌ను సూపర్ అనడం ఏంటని షాకవుతున్నారు. కానీ ఈ ట్టీట్ వెనుక ఓ విమర్శ ఉంది. అది ఏంటనుకుంటున్నారా.

కేశినేని నాని జగన్ గురించి తన ట్వీట్‌లో 'జగనన్న నువ్వు సూపర్ అన్న. కేసుల మాఫీ కోసం నీ ఎంపీలతో CABకు అనుకూలంగా ఓటేపిస్తావు. ముస్లింల ఓట్ల కోసం NRCకి వ్యతిరేకం అంటావు. ఏదయినా నీకే చెల్లిందన్న.. హ్యాట్సాఫ్ అన్నా'అంటూ సెటైర్లు పేల్చారు. అంతే కాదు ఎంపీ కేశినేని నాని అమరావతిని ఎడారితో పోల్చిన అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంను కూడా తన ట్విట్టర్‌లో టార్గెట్ చేస్తున్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories