విశాఖను వాళ్ళ బారి నుండి దేవుడే రక్షించాలి: ఎంపీ కేశినేని

విశాఖను వాళ్ళ బారి నుండి దేవుడే రక్షించాలి: ఎంపీ కేశినేని
x
కేశినేని నాని, జగన్మోహన్ రెడ్డి (ఫైల్ ఫోటో)
Highlights

ప్రస్తుతం అమరావతిలో ఉన్న రాజధానిని మూడు ప్రాంతాలకు తరలించాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం అమరావతిలో ఉన్న రాజధానిని మూడు ప్రాంతాలకు తరలించాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి తెలుగుదేశం పార్టీ అడ్డు చెబుతోంది. రాజధానిని మొత్తంగా అమరావతిలోని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, గణబాబు మాత్రం విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావడాన్ని స్వాగతిస్తున్నారు. కానీ విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడితే జగన్ వలెనే ఇబ్బందులు పడాల్సి వస్తుందని టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ ఆరోపించారు.

పాకిస్థాన్ నుండి విశాఖను రక్షించేందుకు భారత దేశ సైన్యం వుంది కాని విశాఖకు అసలు ముప్పు ప్రస్తుతం మన వైఎస్ జగన్ అండ్ గ్యాంగ్ వలెనే అని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బారి నుండి విశాఖను దేవుడే రక్షించాలి అని విమర్శించారాయన. రాజధానిని మూడు ముక్కలు చెయ్యడం వలన ప్రయోజనం ఏమిటో చెప్పాలని ఎంపీ డిమాండ్ చేశారు. ఇప్పటివరకు పెట్టిన ఖర్చు అంతా వృధా అయిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు జగన్ కోరుకుంటున్నట్లు రాష్ట్రమంతా అభివృధి చెందాలంటే కొత్తగా ఏర్పాటు చేసే 25 జిల్లాలలో జిల్లాకి ఒక్కటి చప్పున 25 రాజధానులు పెడితే బాగుంటుందేమో ఆలోచించండి అంటూ వెటకారం చేశారు.Show Full Article
Print Article
More On
Next Story
More Stories