టీడీపీ ఎంపీ దాతృత్వం.. కరోనా అదుపులోకి వచ్చేవరకూ జీతం విరాళం


రాష్ట్రంలో కరోనా వైరస్ అదుపులోకి వచ్చే వరకూ తన వేతనాన్ని విరాళంగా అందజేయనున్నట్టు తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రకటించారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ అదుపులోకి వచ్చే వరకూ తన వేతనాన్ని విరాళంగా అందజేయనున్నట్టు తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రకటించారు. లాక్‌డౌన్ ముగిసే వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన జాగ్రత్తలు ప్రజలు తీసుకోవాలన్నారు. ఇంట్లోనే ఉంటే కరోనాపై విజయం సాధించవచ్చని జయదేవ్ తెలిపారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో జాగ్రత్తలతోపాటు నిత్యావసరాల పంపిణీ చేయాలని కోరారు.
ఈ సందర్భంగా కరోనా అదుపులోకి వచ్చే వరకూవేతనంగా వచ్చే 1.9 లక్షల రూపాయలు పలు సహాయ కార్యక్రమాలకు కేటాయించాలని నిర్ణయించినట్టుగా వెల్లడించారు. ప్రతి నెలా ఒక్కో రంగానికి సహాయం చేస్తానని ప్రకటించారు. ఏప్రిల్ నెల వేతనాన్ని కరోనా వైరస్ పోరాటంలో అహర్నిశలు శ్రమిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది, వారి కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరకులు పంపిణీ చేశమన్నారు. అలాగే నిబంధనలు పాటిస్తూ అమర్‌రాజా కంపెనీ పనులను కొనసాగిస్తున్నామని తెలిపారు.
ఏపీలో ట్రూనాట్, క్లియా పరీక్షలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలలో పీసీఆర్ పరీక్షలు చేస్తున్నారని గల్లా జయదేవ్ అన్నారు. వలస కూలీలను తీసుకొచ్చేదుకు ముమ్మర ఏర్పాట్లు చేయాలన్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



