ప్రభుత్వానికి షాక్.. శాసనమండలిలో నెగ్గిన టీడీపీ తీర్మానం

ప్రభుత్వానికి షాక్.. శాసనమండలిలో నెగ్గిన టీడీపీ తీర్మానం
x
Highlights

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రవేశపెట్టిన రూల్ 71పై తీర్మానం నెగ్గింది. తొలుత తీర్మానంపై చర్చ జరిగిన అనంతరం ఛైర్మన్ షరీఫ్ ఓటింగ్ నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రవేశపెట్టిన రూల్ 71పై తీర్మానం నెగ్గింది. తొలుత తీర్మానంపై చర్చ జరిగిన అనంతరం ఛైర్మన్ షరీఫ్ ఓటింగ్ నిర్వహించారు. రూల్ 71 తీర్మానానికి అనుకులంగా 27, వ్యతిరేకంగా 13,తటస్థంగా 9 ఓట్లు పడ్డాయి. ఓటింగ్ సమయంలో టీడీపీ చెందిన ఇద్దరు సభ్యులు పోతుల సునీత, శివనాథ్ షాక్ ఇచ్చారు. సభ ప్రారంభం కాగానే రూల్ 71కింద శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై అధికార పార్టీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఓటింగ్ అనంతరం సభ రేపటికి వాయిదా వేశారు. ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెట్టేముందు రూల్ 71 తీర్మానం పెట్టడం విరుద్ధమని వైసీపీ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

అంతకుముందు పలుమార్లు సభ వాయిదా పడింది. తర్వాత శాసనమండలి సమావేశాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. మండలి ఛైర్మన్ అనుమతితో ప్రభుత్వం రెండు బిల్లులను ప్రవేశపెట్టింది. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆర్ధిక మంత్రి బుగ్గన, సీఆర్డీఏ రద్దు బిల్లును మంత్రి బొత్స శాసనమండలిలో ప్రవేశపెట్టారు. మండలి ప్రారంభం నుంచే ఇవాళ సభలో రూల్‌ 71 పై తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

బిల్లులను ప్రవేశపెట్టేందుకు టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మండలిలో వాయిదాల పర్వం కొనసాగింది. మండలి ఛైర్మన్‌ను టీడీపీ సభ్యులు ప్రభావితం చేస్తున్నారని.. వైసీపీ సభ్యులు, మంత్రులు ఆరోపించారు. మరోవైపు, మండలిలో రూల్ 71పై చర్చ జరపాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. రూల్ 71పై చర్చకు పట్టుబడుతూ.. విపక్ష సభ్యులు నినాదాలు చేయడంతో మండలిలో గందరగోళం కొనసాగింది. దీంతో ఛైర్మన్ సభను పలుమార్లు వాయిదా వేశారు.

చివరకు మంత్రులు మండలి ఛైర్మన్‌తో భేటీ కావడంతో.. బిల్లులను ప్రవేశపెట్టేందుకు అనమతించారు. దీంతో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే రూల్‌ 71 కింద నోటీసులిస్తే.. బిల్లులను ప్రవేశపెట్టేందుకు ఎలా అనుమతిస్తారని.. టీడీపీ సభ్యులు ఆరోపిస్తూ.. మండలిలో ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories