TDP MLCs: టీడీపీ ఎమ్మెల్సీలకు షాకిచ్చిన కేంద్రం..

TDP MLCs: టీడీపీ ఎమ్మెల్సీలకు షాకిచ్చిన కేంద్రం..
x
Highlights

టీడీపీ ఎమ్మెల్సీలకు ఢిల్లీ పెద్దలు షాక్ ఇచ్చారు. శాసన మండలి రద్దుపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు టీడీపీ ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులకు అపాయింట్మెంట్...

టీడీపీ ఎమ్మెల్సీలకు ఢిల్లీ పెద్దలు షాక్ ఇచ్చారు. శాసన మండలి రద్దుపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు టీడీపీ ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులకు అపాయింట్మెంట్ దొరకలేదు. దాంతో ఢిల్లీ పర్యటన తాత్కాలికంగా రద్దయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి టీడీపీ ఎమ్మెల్సీలు మంగళవారం ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను కలిసి మండలి రద్దుపై ఫిర్యాదు చేయాల్సి ఉన్నా. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా సహా ఇతర కేంద్ర మంత్రులు ఎవ్వరూ వారికి అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని సమాచారం. దీంతో ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అపాయింట్‌మెంట్ మాత్రం ఖాయమైంది.

అయితే మంత్రుల అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో వెంకయ్యనాయుడుతో భేటీ కూడా క్యాన్సిల్ చేసుకున్నట్టు సమాచారం. కాగా హస్తిన టూర్‌లో ఎమ్మెల్సీలు శాసనమండలి రద్దు బిల్లు, సీఆర్డీయే చట్టం రద్దు బిల్లు, మూడు రాజధానుల అంశం.. అలాగే రాజధాని ఉద్యమం, అమరావతి తరలింపును నిరసిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలనుకున్నారు. రెండు రోజుల పాటూ ఢిల్లీలోనే ఉండేలా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు. అయితే కేంద్ర పెద్దల అపాయింట్‌మెంట్‌ దొరకకపోవడంతో టీడీపీ నేతలు, ఎమ్మెల్సీలు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇదిలావుంటే గతవారమే ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రవిశంకర్ ప్రసాద్‌లను కలిశారు. ఆ సందర్బంగా మూడు రాజధానుల అంశంపై చర్చించారు.

కర్నూలుకు హైకోర్టు తరలింపునకు కేంద్రం ఒకే చెప్పినట్టు వైసీపీ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే శాసనమండలి రద్దు బిల్లుకు ఆమోదం తెలుపుతారని ఆశిస్తున్నారు. ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చెయ్యాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని టీడీపీ సహా ప్రతిపక్షాలు అన్ని వ్యతిరేకిస్తున్నాయి. అయినా శాసనసభలో వైసీపీ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెటింది. అయితే శాసనమండలిలో టీడీపీకి మెజారిటీ ఉండటంతో ఈ బిల్లును చైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపించారు. దాంతో ఈ నిర్ణయంపై గరం గరం అయిన వైసీపీ శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. దీనిపై టీడీపీ పోరాటం చేస్తోంది. ఈ క్రమంలో కేంద్ర పెద్దలను కలవాలని అనుకున్నారు కానీ తాజా పరిణామాలు ఆ పార్టీకి వ్యతిరేకంగా మారాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories