Andhra Pradesh: సీఎం జగన్ ను కలిసిన టీడీపీ కీలక నాయకురాలు.. ఆమంచి పరిస్థితి ఏంటి?

Andhra Pradesh: సీఎం జగన్ ను కలిసిన టీడీపీ కీలక నాయకురాలు.. ఆమంచి పరిస్థితి ఏంటి?
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత ఆమె భర్త సురేష్ కలిశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత ఆమె భర్త సురేష్ కలిశారు. ఈ సందర్బంగా ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఆమె కోరారు. అలాగే ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించానని అందుకే ప్రభుత్వానికి అనుకూలంగా మండలిలో వ్యవహరించానని అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రభుత్వం చేస్తున్న పలు అభివృద్ది కార్యక్రమాలు చాలా బాగున్నాయని.. అందుకే వైసీపీ ప్రభుత్వానికి తాను మద్దతు ఇస్తున్నట్టు సునీత స్పష్టం చేశారు.

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సీఎం జగన్‌ ఎంతగానో కృషి చేస్తున్నారని పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. టీడీపీ సభ్యులు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ బిల్లులు అడ్డుకున్నారని ఆరోపించారు. మండలి చైర్మన్‌ టీడీపీ కార్యకర్తగా వ్యవహరించారని విమర్శించారు. అభివృద్ధికి ఆటంకంగా ఉన్న శాసస మండలి ఉండాలా వద్దా అనే అంశంపై చర్చించాలని ఆమె అన్నారు. ఇదిలావుంటే పోతుల సునీత, సురేష్ త్వరలో వైసీపీ చేరడం ఖాయమైనట్టు చీరాల నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది.

పరిటాల కుటుంబానికి ముఖ్య అనుచరుడిగా ఉన్న పోతుల సురేష్ టీడీపీని వదిలి వైసీపీలో చేరడం అంటే పెద్ద చర్చే అవుతుందనేది రాజకీయ విశ్లేషకుల మాట. అలాగే ఎమ్మెల్సీ గా ఉండి కూడా చీరాలలో ఏమి చేయలేకపోతున్నానే అభిప్రాయం ఆయన సతీమణి సునీతలో ఉన్నట్టు తెలుస్తోంది. చీరాలలో టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం కారణంగా పార్టీ నాయకత్వం పట్ల ఆమె అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అందుకే తన అసంతృప్తిని మండలి వేదికగా బయటపెట్టినట్టు సమాచారం.

మరోవైపు పోతుల సునీత పార్టీలోకి వస్తే చీరాల వైసీపీ ఇంచార్జ్ ఆమంచి కృష్ణమోహన్ పరిస్థితి ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. ఆమంచికి పోతుల వర్గానికి మధ్య ఎప్పటినుంచో వైరం నడుస్తోంది. ఒకవేళ పోతుల దంపతులు వైసీపీలోకి వస్తే రెండు వైరి వర్గాలు ఇమడగ లుగుతాయా అన్న చర్చ ఇప్పటినుంచే మొదలయింది. మరి ఏమి జరుగుతుందో చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories