ఏపీ హైకోర్టులో టీడీపీ ఎమ్మెల్సీ రెండు పిటిషన్లు

ఏపీ హైకోర్టులో టీడీపీ ఎమ్మెల్సీ రెండు పిటిషన్లు
x
Highlights

జగన్ సర్కార్ ప్రతిష్టాత్మక తీసుకున్న కీలక బిల్లులు వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లు, మండలి రద్దు వ్యవహారం మరో మలుపు తిరిగింది. శాసనసభలో రెండు...

జగన్ సర్కార్ ప్రతిష్టాత్మక తీసుకున్న కీలక బిల్లులు వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లు, మండలి రద్దు వ్యవహారం మరో మలుపు తిరిగింది. శాసనసభలో రెండు బిల్లుల్ని పెట్టడాన్ని..అలాగే మండలి రద్దును వ్యతిరేకిస్తూ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేశారు. శాసనమండలి రద్దు కోసం అసెంబ్లీలో చేసిన తీర్మానం ఎమ్మెల్సీల హక్కుల్ని కాలరాసేలా ఉందని శాసనభ పార్లమెంట్‌కు పంపిన తీర్మానం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలన్నారు.

ఈ సందర్భంగా వేర్వేరు పిటిష్లను దాఖలు చేశారు. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు సెలక్ట్‌ కమిటీకి పంపించాక సొంత ప్రయోజనాల కోసం మండలిని రద్దు చేయాలన్న తీర్మానం చేశారని పిటిషన్‌లో ఆయన ప్రస్తావించారు. పార్లమెంటులో ఎలాంటి చట్టం చేయకుండా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కార్యదర్శిని, లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ను ఆదేశించాలని కోర్టును కోరారు. గతంలో మండలి సెలక్ట్‌ కమిటీకి పంపిన బిల్లుల్ని మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారని పిటిన్లను దాఖలు చేశారు. ఆ బిల్లుల్ని మరోసారి మండలికి పంపించారని గుర్తు చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories