పోలీసుల అదుపులో టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు

TDP MLC Ashok Babu in Police Custody
x

పోలీసుల అదుపులో టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు

Highlights

Andhra Pradesh: వారం క్రితం అశోక్‌ బాబుపై సీఐడీ కేసు నమోదు.

Andhra Pradesh: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌ బాబును ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. అశోక్‌ బాబు ఉద్యోగ సమయంలో విద్యార్హతను తప్పుగా చూపించారని పేర్కొంటూ సీఐడీ ఆయనను అరెస్టు చేసింది. పదోన్నతి విషయంలో విద్యార్హత తప్పుగా చూపించారని అశోక్‌బాబుపై ఆరోపణలు వచ్చాయి. దీంతో సీఐడీ అధికారులు గురువారం రాత్రి ఆయన ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ ఘటనపై టీడీపీ స్పందించింది. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే అశోక్‌బాబును సీఐడీ అరెస్టు చేసిందని విమర్శించింది.

ఎమ్మెల్సీ అశోక్‌ బాబును అరెస్టు చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఆయన అరెస్టును చంద్రబాబు ఖండించారు. సర్వీస్‌ విషయంలో తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. అర్ధరాత్రి పూట అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీసినందుకే ప్రభుత్వం కక్షగట్టిందని ఆయన అన్నారు. జగన్‌ ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుకు మూల్యం చెల్లిస్తుందని చంద్రబాబు హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories